|
|
హైదరాబాదులో జాతీయ సెయిలింగ్
(ఫీచర్స్ ఇండియా, హైదరాబాద్)
నగరానికి చెందిన యాచ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు ఈ నెల 12 నుంచి జరుగనున్నాయి. హెచ్‌ఎమ్‌డిఎ సంపూర్ణ సహకారంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఇక్కడ నిర్వహించిన సమావేశంలో నిర్వాహకులు తెలిపారు. 'టాటా పొటాన్ మాన్‌సూన్ రెగెట్టా' పేరిట జరుగనున్న ఈ పోటీలను ముఖ్యంగా రెండు ప్రధాన కారణాలతో నిర్వహిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో సెయిలింగ్ క్రీడకు మరింత ప్రాచుర్యం కిల్పించడం అందులో ఒకటి కాగా హుస్సేన్‌సాగర్ నీటిని శుద్ధి చేయడంపెపరిశుభ్రంగా ఆరోగ్యకరంగా మార్చవలసిన అవసరాన్ని ఈ పోటీల ద్వారా తెలియచెప్పనున్నామన్నారు.
నగరంలోని ప్రతి ఒక్కరి మనసుకు దగ్రిదైన హుస్సేన్‌సాగర్‌ను శుభ్రపరచడం అనే అంశానికి ప్రాధాన్యమిస్తూ తమ పోఈలకు ఈ ఏడాదిఛీద థీమ్‌గా 'ఫర్ ఎ క్లీన్ హుస్సేన్ సాగర్'ను ఎంచుకున్నట్టు వివరించారు.
దాదాపు 30 సంవత్సరాల క్రితం సెయిలింగ్ నేర్చుకున్నపుడు ఈత కొడుతున్నపుడునీళ్లు చాలాస్వఛ్ఛంగా ఉండేవని,5 అడుగుల లోతు దాకా నీళ్లు స్వఛ్ఛంగా చూడడానికి స్పష్టంగా కనపడేవన్నారు. కాలక్రమంలో ప్రస్తుతం ఇక్కడి హుస్సేన్‌సాగర్.. వ్యర్థపదార్థాలతో, రసాయనాలతో నిండిపోయిందన్నారు.
ప్రజల్లో ఈ పరిస్థితిపై అవగాహన పెంచి ప్రజలు,ప్రభుత్వం కలిసి కట్టుగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసేందుకు ఈ టాటా ఫోటాన్‌మాన్‌సూన్ రెగట్టా సహకరిస్తుదన్నారు.ప్రపథమంగా భారతదేశంలో బ్యాట్రానిక్స్ ట్రాకింగ్‌కు చోటు కల్పిస్తున్న రెగట్టా ఇదేనన్నారు. దీనికి జిపిఎస్ డివైసెస్ తమకు సాంకేతిక భాగస్వామ్యాన్ని అందిస్తోందని తెలిపారు. దీని ద్వారా ఈ పోటీలను అభిమానులు అంతర్జాతీయ యాచ్‌రేస్‌ల తరహాలో ఇంటర్‌నెట్ మీద ట్రాక్ చేసేందుకు వీలుంటుందన్నారు.
ఇన్‌లీండ్ మ్యాచ్ రేసింగ్ నేషనల్స్...
మాన్‌సూన్ రెగట్టా ప్రస్తుత డిఫెడింగ్ ఛాంపియన్ అయిన నితిన్ మోంగియా,నేషనల్ ఛాంపియన్, ప్రపంచంలో 33 వ ర్యాంకు క్రీడాకారుడు అయిన ఆర్.మహేష్, ఆషిమ్ మోంగియాలు ఈ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. గత ఏడాది 2009లో జరిగిన పోటీల్లో. నేషనల్ చాంపియన్ మహేష్‌ను నితిన్ మోంగియా వెంట్రుకవాసి తేడాతో ఉత్తేజభరితంగా పోటీలో ఓడించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. వీరిద్దరూ ఇప్పుడు హైదరాబాద్‌లోని సెయిలింగ్ క్రీడాప్రియుల ఇంటింటా మార్మోగే పేర్లుగా ఉన్నారన్నారు.
ప్రపంచ స్థాయి సెయిలింగ్ క్రీడాకారుల్లో 33 ర్యాంకుతో ఉన్న మహేష్, 93వ ర్యాంకుతో ఉన్న నితిన్‌ల మధ్యమ్యాచ్ రేసింగ్ పోఈ భారత్,పాక్‌ల మధ్య టి 20 మ్యాచ్ తరహాలో చివరి దాకా ఉత్కంఠ కలిగిస్నుందన్నారు.ఇక మిహళా క్రీడాకారుల్లో ప్రస్తుత ఛాంపియన్ అయిన ఆయేషా లోబో.. ముంబయిలో కఠినమోన శిక్షణ పొంది పోటీలకు ఆసక్తిగా సిద్ధమయ్యారని తెలిపారు వైఎఐ ఇన్‌ల్యాండ్ నేషనల్ మ్యాచ్ రేసింగ్ ఛాంపియన్‌షిప్ ట్రోఫీ టాటా ఫొటాన్ స్పాన్సర్ చేస్తోందన్నారు.
|
|
|