న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
నిర్మాణ రంగానికి కార్మికుల కొరత!

(ఫీచర్స్ ఇండియా, న్యూఢిల్లీ)
జోరుమీదున్న దేశీయ నిర్మణ రంగం తాజాగా ఓ చిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ఇప్పటి వరకు ఆర్ధిక మాంద్యం వల్ల సతమతమైన ఈ రంగం ఇప్పుడు తీవ్రమైన కార్మికుల (లేబర్‌) కొరతను ఎదుర్కుంటోంది. భవిష్యత్‌ కాలంలో ఈ కొరత మరింత పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని స్థిరాస్థి రంగాల సమాఖ్య క్రెడాయ్‌ తెలిపింది. నిపుణత కలిగిన వారు, నైపుణ్యం లేని కార్మికులు నిర్మాణ రంగంలో, ఇందులో స్థిరాస్థి రంగంతో కూడా కలిపి మొత్తం ఒక రోజులో 33 మిలియన్‌ల కొరతను చూపిస్తుందని క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌ రూంగ్టా తెలిపారు. కార్మికుల లోటు 30శాతంగా ఉందని, పరిస్థితులు చేతులు దాటకముందే తగిన చర్యలు చేపట్టాలని కోరారు.

పెరుగుతున్న ఆదాయ వ్యవసాయ రంగం వృద్ధితో పాటు దేశంలోని చాలా మంది కార్మికులు గల్ఫ్‌ ప్రాంతాలకు వలసలకు వెళ్ళడంతో నిర్మణ రంగంలో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు ఇతర నిపుణత కలిగిన కార్మికుల కొరత ఉందని పేర్కొన్నారు. పరిశ్రమ త్వరగా మేలుకొని ఈ ఆధునిక సవాల్‌ను స్వీకరించాలని, వేతనాలతో కూడిన కొత్త టెక్నాలజీలను నిర్మాణ రంగాలకు ప్రవేశపెట్టాలని కోరారు. వృద్ధిచెందుతున్న దేశాల్లో మాదిరిగా మనము టెక్నాలజీను ఉపయోగించడం లేదని, ఈ విధమైన పద్ధతికి డెవలపర్లు సముఖంగా లే రని పేర్కొన్నారు. పెట్టుబడులను అధికం చేసే టెక్నాలజీపై భారత డెవలపర్లు ఆసక్తి కనబరచరని, 90శాతం దేశ గృహ అవసరాలు చిన్న-మధ్య తరగతి విభాగానికి చెందిన వారు కావడంతో ఈ విధానం కష్టమని తెలిపారు.

అయితే ఫ్యాక్టరీల్లోనే నిర్మాణ ప్రాజెక్టులను విడిభాగాలను తయారు చేసుకుని, ప్రాజెక్టు పనులు మాత్రం సైట్‌లో చేపడితే కార్మికుల సమస్య పెద్దగా ఉండదని సమర్థించుకున్నారు. ప్రస్తుతం నెలకొన్న కార్మికుల కొరత కారణంగా ప్రీ-ఇంజనీర్డ్‌ బిల్డింగ్స్‌ వృద్ది చెందే అవకాశాలుంటాయని అన్నారు. ఈ విధమైన ఆధునిక పద్ధతులను ఇప్పటికే హై-ఎండ్‌ హౌసింగ్‌ ప్రాజెక్టుల్లో, వాణిజ్య బిల్డింగ్‌లకు ఉపయోగిస్తున్నారని, అయితే సమయానుకూలంగా ఈ కొత్త సూత్రం అమల్లోకి వస్తుందని రూంగ్టా తెలిపారు.