న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ఎస్‌ఎంసీఈ సభ్యత్వరుసుం పెంపు

(ఫీచర్స్ ఇండియా, ముంబై)
మొట్టమొదటి ఆన్‌లైన్‌ నేషనల్‌ మల్టీ కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌ అయిన నేషనల్‌ మల్టీ కమోడిటీ ఎక్స్‌ ఛేంజ్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఎన్‌ ఎంసీఈ) తన సభ్యత్వ రుసుము తీరు లో మార్పు లు చేసింది. మూడు విభా గాల (ట్రేడింగ్‌ మెంబ ర్‌షిప్‌ (టీఎం), ట్రేడింగ్‌ కమ్‌ క్లియరింగ్‌ మెంబ ర్‌షిప్‌ (టీసీఎం), ఇనిస్టిట్యూ షనల్‌ క్లియరింగ్‌ మెంబ ర్‌షిప్‌ (ఐసీఎం))ల సభ్యత్వరుసుమును పెంచింది. టీసీఎం సభ్యత్వ రుసుమును రూ. 3.20 లక్షల నుంచి రూ. 7.25 లక్షలకు పెంచింది. ట్రేడింగ్‌ మెంబర్‌షిప్‌ సభ్యత్వరుసుమును రూ. 60 వేల నుంచి రూ. 85 వేలకు పెంచారు. ఐసీఎం సభ్యత్వ రుసుమును రూ. 23 లక్షల నుంచి రూ. 27.5 లక్షలకు పెంచారు.

దీనికి అదనంగా, ఇనిస్టిట్యూషనల్‌ ట్రేడింగ్‌ కమ్‌ క్లియరింగ్‌ మెంబర్‌ (ఐటీసీఎం) అనే నూతన విభాగాన్ని ఏర్పాటు చేశారు. దీని సభ్యత్వ రుసు ము రూ. 15.5 లక్షలు.సభ్యత్వరుసుములో మార్పు 2010 ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుంది.గత కొన్నేళ్ళుగా ఎన్‌ఎంసీఈ శరవేగంతో విస్తరిస్తోంది. తన కంటూ పటిష్ఠమైన బ్రాండ్‌ ఇమేజ్‌ను ఏర్పర చుకుంది. దేశవ్యాప్తంగా పెరిగిన సభ్యత్వమే ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఇందులో ఇప్పటిదాకా సుమారుగా 400 దాకా సభ్యత్వా లున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర విభాగాల్లో యాక్టివ్‌ కమోడిటీస్‌ సంఖ్య కూడా పెరిగింది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్‌ గత ఏడాదితో పోలిస్తే 270 శాతం పెరిగిందని సంస్థ బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ పూనమ్‌ వర్మ అన్నారు.