|
|
13న గుంటూరుకు శ్రీ కృష్ణ కమిటీ
గుంటూరు: ఈ నెల 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిస్ధితులపై వివిధ వర్గాల ప్రజలతో సంప్రదించేందుకు కేంద్రంచే నియమింపబడిన శ్రీ కృష్ణ కమిటీ ఈనెల 13వ తేదీన గుంటూరు జిల్లాకు రానున్న దృష్ట్యా కమిటీ పర్యటించేందుకు పెదకాకాని మండలం కొప్పురావూరు, మంగళగిరి మండలం బేతపూడి గ్రామాలను జిల్లా కలెక్టర్ బి.రామాంజనేయులు, సంయుక్త కలెక్టర్ డా.ఎ.శరత్ సందర్శించారు. కమిటీ సమావేశమయ్యే ప్రాంతాలను పరిశీలించి నిర్ణయించారు.
శ్రీకృష్ణ కమిటీ, పై రెండు గ్రామాలను సందర్శించి ప్రజలతో రాష్ట్ర పరిస్ధితులపై చర్చించనున్నందున తగిన సలహాలను, సూచనలను అందించేలా గ్రామస్తులను సమాయత్తం చేయాలని కలెక్టర్ ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లను ఆదేశించారు. కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత తాసీల్దార్లకు కలెక్టర్ సూచించారు. వీరి వెంట మంగళగిరి ఎం.పి.పి నాగేశ్వరరావు, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి జి.గంగాధర్ గౌడ్, పెదకాకాని, మంగళగిరి తాసీల్దార్లు, మంగళగిరి ఎం.పి.డి.ఓ విజయలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.
|
|
|