|
|
తీవ్రవాద ప్రాంతాలలో మౌళిక సదుపాయాలు
తీవ్రవాద ప్రబావిత ప్రాంతాలలో మౌళిక సదుపాయాల గురించి కేంద్ర ప్రణాళిక సంఘం సెక్రటరీ సుదాపిళ్లై రాష్ట్ర ప్రదానకార్యదర్శి, జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్పరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బముగా ఆమె జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాలలో అవసరమైన విద్యుదీకరణ, రొడ్డు సౌకర్యం, మంచినీటి వసతి అంశాల గురించి సమీక్షించారు. 250 నుండి 500 వరకు జనాబా గల గిరిజన ప్రాంతాల హ్యబిటెషన్లకు ప్రత్యేక పదకం కింద 500 పైబడిన హ్యబిటెషన్కు సాదారణ పధకం కింద రొడ్డు సౌకర్యం కల్పించాలని ఆమె సూచించారు.
తీవ్రవాద ప్రబావిత ప్రాంతాలలో ప్రత్యేక అబివృద్ది పదకం రాజీవ్ గాంది గ్రామీణ విద్యుదీకరణ ప్రాజెక్టు కింద జిల్లాలో చేపట్టనున్న పనులకు సంబందించిన ప్రతిపాదనలను ప్రణాళికా సంఘానికి సమర్పించిన వివరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ యన్.నాగేశ్వరరావు వివరించారు. రోడ్డు సౌకర్యానికి 140 పనులకు 136 కొట్లు విద్యుదీకరణకు సంబందించి 12092 పనులకుగాను 20 కోట్లు విద్య వసతులకనుగుణంగా 32 పనులకుగాను 147 కోట్లు వైద్య సదుపాయాల కల్పనకు సంబందించి అరొగ్య కేంద్రాలు ఉప ఆరొగ్య కేంద్రాల ఎర్పాటుకుగాను 25 కొట్లు అంగన్ వాడి కేంద్రాలను 10 కోట్లు త్రాగునీటి పనులకై 10 కొట్లు మొత్తం 17687 పనులకుగాను 691 కొట్లు ప్రతిపానలు కేంద్ర పభుత్వానికి సమర్పించినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
|
|
|