న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
ఏలూరులో నీటి శుద్ధి తీరుపై మేయరు పరిశీలన

ఏలూరు, జులై 5(ఫీచర్స్ ఇండియా): నగరంలో ప్రజలకు సురక్షితమైన నీటినే సరఫరా చేస్తున్నామని, ప్రజలు ఎ టువంటి అపోహలు చెందకుండా నిరభ్యంతరంగా నీటిని త్రాగవచ్చునని మేయరు తాడిగడప రామారావు భరోసా ఇచ్చారు. స్ధానిక పంపుల చెరువులో మంచినీటి ఫిల్టరైజేషన్‌ జరుగుతున్న తీరును, నీటినిల్వ పరిస్ధితిని సోమవారం పరిశీలించారు. ప్రజరోగ్య శాఖ వాటర్‌ సీనియర్‌ ఎ నలిస్టు ద్వారా త్రాగునీటి పరీక్షలను మేయరు నిర్వహింపజేసారు. ఆరు చోట్ల నీటిని పరీక్షలు చేయగా క్లోరిన్‌ శాతం 2 పిపియం ఉందని, ఈ నీటిని ప్రజలు త్రాగవచ్చునని, ఎ టువంటి భయాందోళ నలు చెందాల్సిన పనిలేదని రామారావు చెప్పారు. పంపుల చెరువులో నీటి నిల్వలు తగ్గిపోవడం, కృష్ణా కాలువ నుండి హడావిడిగా నీటిని మళ్లించడం తద్వారా త్రాగునీరు కొంత కలుషితం కావడం వలన కొంతమంది ప్రజలు ఆస్పత్రి పాలు కావడంతో త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, ప్రస్తుతం అందిస్తున్న తీరు ఎ ంతో సురక్షితమైనదని, ఈ విషయంలో ప్రజలు ఆవేదన చెందాల్సిన పనే లేదని మేయరు స్పష్టం చేసారు. నగరంలో ప్రస్తుతం పరిస్ధితి అదుపులోనే ఉన్నదని, అతిసార వ్యాధి క్రొత్తగా ఎ వరికీ రాలేదని ఆయన చెప్పారు. ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల నాని ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజల ఆరోగ్య పరిస్ధితులపట్ల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారని ఈమేరకు నగరంలో త్రాగునీటి సరఫరా వ్యవస్ధను స్వయంగా పరిశీలించి అవసరమైన తగు చర్యలు చేపట్టిన్నట్లు రామారావు చెప్పారు. పంపుల చెరువులో ప్రస్తుతం నీటిమట్టం మూడు అడుగులు మాత్రమే ఉన్నదని, ఏడు అడుగులకు చేరితే తప్ప రెండు పూటలా త్రాగునీటిని సమృద్ధిగా అందించలేమని మేయరు చెప్పారు. కృష్ణా కాలువకు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేసిన దృష్ట్యా మరో నాలుగు రోజుల్లో నీటిని పంపుల చెరువులోనికి పెద్ద ఎ త్తున మళ్లించి, రెండుపూటలా త్రాగునీటిని నిరంతరం సరఫరా చేస్తామని రామారావు స్పష్టం చేసారు. ఏలూరు నగర ప్రజలకు నిత్యం ముప్పయి లక్షల మిలియన్‌ లీటర్ల త్రాగునీరు అవసరమని, ప్రస్తుతం పదిహేను లక్షల మిలియన్‌ లీటర్ల నీటిని బోర్లు ద్వారా, పదిలక్షల పంపుల చెరువు ద్వారా అందించగలుగుతున్నామని, నాలుగు రోజులు తర్వాత బోరు నీటిని నిలుపుదల చేసి కృష్ణా, గోదావరి జలాలను సక్రమంగా ఫిల్టరైజేషన్‌ చేసి ప్రజా అవసరాలకు అనుగుణంగా ముప్పయి లక్షల మిలియన్‌ లీటర్ల నీటిని అందిస్తామని రామారావు చెప్పారు. వేసవి కాలంలోనే ఎ టువంటి ఇబ్బందులు లేకుండా ప్రజల అవసరాలను తీర్చగలిగామని, గత రెండు రోజుల క్రితం చిన్న పొరపాటు వల్ల కొంతమంది ప్రజలు అనారోగ్యపాలు అయ్యారని, ఇటువంటి పరిస్దితి భవిష్యత్తులో పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తాడిగడప రామారావు చెప్పారు. మేయరు వెంట ఇంజినీరు ప్రసాద్‌, పబ్లిక్‌ హెల్త్‌ సీనియర్‌ ఎనలిస్టు వై. శివరామకృష్ణ, ఆనందకుమార్‌ , తదితరులు ఉన్నారు.